'రాజుగారి తోట' లో..విందుకెళ్దామా?

updated: February 28, 2018 13:16 IST
'రాజుగారి తోట' లో..విందుకెళ్దామా?

ఈ రోజున హోటల్ లేదా రెస్టారెంట్  బిజినెస్ కు మన తెలుగు రాష్ట్రాల్లో రెక్కలు వచ్చాయి. కొత్త రుచులు చూసే వారు ఎక్కువ అవటం, ఆహారంపై ఖర్చు పెట్టడానికి తెలుగు వారు ఉత్సాహం చూపెడూతూండటంతో ఈ బిజినెస్ మూడు ఇడ్లీలు,నాలుగు దోశల్లా సాగిపోతోంది. ముఖ్యంగా సినిమావాళ్లు సైతం ఈ బిజినెస్ లోకి రావటంతో ఇక్కడ కూడా క్రియేటివిటి కనపడుతోంది. హోటల్ డిజైన్ నుంచి,లోపల మెనూ, వడ్డించే ఆహారం దాకా అంతా కొత్త కొత్తగా సాగిపోతోంది.

ఉలవచారు, కిచెన ఆఫ్ కూచిపూడి, కోన అండ్ కూచిపూడి, సెవన్ బిర్యానీస్ , వంటి రెస్టారెంట్స్ పెట్టిన కూచిపూడి వెంకట్ (మొదటి సినిమా, జాన్ అప్పారావు చిత్రాల దర్శకుడు) మరో కొత్త రెస్టారెంట్ కు నాంది పలికారు. హైదరాబాద్ , విజయవాడ బస్ రూట్ లో సూర్యపేట వద్ద ఈ రెస్టారెంట్ ని నిర్మించారు. రాజుగారి తోట పేరుతో రూపొందిన ఈ హోటల్ ని  ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర సైతం ఓ పార్టనర్ అని తెలుస్తోంది.  మార్చి 1 వ తేదీన ఓపెన్ అవుతున్న ఈ హోటల్ ఫొటోలు ఇక్కడ చూడవ్చచు. హోటల్ ఎవరిదైనా,ఎక్కడున్నా  రుచులు బాగుంటే మన తెలుగువాళ్లు రెక్కలుకట్టుకుని వాలిపోతారు. కొత్తగా పెడుతున్న ఈ రెస్టారెంట్   భారీ స్దాయిలో సక్సెస్ అవ్వాలని తెలుగు 100 కోరుకుంటోంది.

comments